నవతెలంగాణ హైదరాబాద్: విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వినయ్ భాస్కర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో ఫిట్స్ రావడంతో గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండె పోటు వచ్చిందని నిర్ధారించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి రెండోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.