నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం పరిధిలోని సోమలింగాల గుట్ట ఆలయం వద్ద సోమవారం నాడు భక్తులు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభమై రెండవ సోమవారం సందర్భంగా భక్తుడు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మద్నూర్ గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో గల సోమలింగాల గుట్ట ఆలయానికి భక్తులు శ్రావణమాసంలో ప్రతి సోమ శని వారాల్లో ప్రత్యేకంగా సందర్శించి, ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.