SRH vs KKR : కీల‌క పోరులో చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్..కేకేఆర్ కు స్వల్ప లక్ష్యం

నవతెలంగాణ-హైదరాబాద్ : ప‌దిహేడో సీజ‌న్‌లో రికార్డు స్కోర్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు కీల‌క పోరులో చేతులెత్తేశారు. ఫైన‌ల్ బెర్తును నిర్ణ‌యించే క్వాలిఫ‌య‌ర్ 1లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్(3/34) విజృంభ‌ణతో హిట్ట‌ర్లంతా డ‌గౌట్ చేరిన‌ చోట‌.. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. హెన్రిచ్ క్లాసెన్‌(32)ల‌తో హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. చివ‌ర్లో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్(30), అబ్దుల్ స‌మ‌ద్‌(16)ల‌ మెర‌పుల‌తో హైద‌రాబాద్ పోరాడ‌గ‌లిగే స్కోర్ చేయ‌గ‌లిగింది. కోల్‌క‌తాకు 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌గ‌లిగింది. టేబుల్ టాప‌ర్‌తో పోరులో టాస్ గెలిచిన క‌మిన్స్ బ్యాటింగ్ తీసుకొని భారీ మూల్య‌మే చెల్లించాడు. 13 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు డగౌట్‌కు చేరారు. తొలి ఓవ‌ర్లోనే ట్రావిస్ హెడ్(0)ను సూప‌ర్ యార్క‌ర్‌తో మిచెల్ స్టార్క్ వెన‌క్కి పంపి స‌న్‌రైజ‌ర్స్‌కు షాకిచ్చాడు. రెండో ఓవ‌ర్లోనే డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(3) సైతం డౌట్ చేర‌డంతో హైద‌రాబాద్ శిబిరంలో ఆందోళ‌న మొద‌లైంది. అయితే.. రాహుల్ త్రిపాఠి(55) అద్భుతంగా పోరాడాడు. హెన్రిచ్ క్లాసెన్(32) అండ‌గా 50 ప్ల‌స్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీళ్లిద్ద‌రూ ధాటిగా ఆడ‌డంతో హైద‌రాబాద్ స్కోర్ 170 దాటుతుంద‌నిపిచింది. కానీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో క్లాసెన్ బౌండ‌రీ వ‌ద్ద చేతికి చిక్కాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన అబ్దుల్ స‌మ‌ద్(16) రెండు సిక్స‌ర్ల‌తో చెల‌రేగాడు. కానీ, న‌రైన్ ఓవ‌ర్లో సింగిల్ తీసే క‌మ్రంలో త్రిపాఠిని ర‌నౌట్ చేశాడు.

Spread the love