ఘనంగా శ్రీ ఆంజనేయ జయంతి ఉత్సవాలు

నవతెలంగాణ – తిరుమలగిరి 
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో గురు స్వామి కన్నెబోయిన సోమయ్య ఆధ్వర్యంలో 50 మంది హనుమాన్ మాలలు ధరించిన స్వాములు భారీ ర్యాలీతో శ్రీ ఆంజనేయ భక్తి పాటలతో నృత్యాలతో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి కన్నబోయిన సోమయ్య మాట్లాడుతూ హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను  ఆచరించడంతో పాటు బూంది లడ్డు, హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించడం వల్ల శ్రీ ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయన్నారు. అలాగే ఈ సంవత్సరం శ్రీ ఆంజనేయ ఆశీస్సులు గ్రామ ప్రజలందరి మీద ఉండి పాడి పంటలు పశువులు చల్లగా ఉండి గ్రామస్తులందరూ ఆయురారోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దయాకర్, ఉపేందర్, సంపత్, యాకన్న, ప్రవీణ్, సైదులు, సతీష్, ఉదయ్,ప్రశాంతి,  వెంకన్న స్వామి, ఉప్పలయ్య,సంతోష్ స్వాములు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love