100లోపు 32 ర్యాంక్‌లు స్వాధీనం
హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోశ్రీచైతన్య విద్యార్థులు విజయపరం పరను కొనసాగించింది. ఓపెన్ కేటగిరిలో ఆలిండియా 1వ ర్యాంక్‌ను తమ విద్యార్థి వావిలాల చిద్విలాస్ రెడ్డి, రెండో ర్యాంక్‌ను రమేష్ సూర్యతేజ సాధించారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్, డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కర్ల రిషి 3వ ర్యాంక్, రాఘవ్ గోయల్(4), బి అభినవ్ చౌదరి (7) ర్యాంక్‌లను పొందారని తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10 లోపు 5 ర్యాంక్‌లు తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర విద్యాసంస్థకూ రాలేదన్నారు. టాప్ 100 లోపు 32 ర్యాంకులు, టాప్ 1000 లోపు 181 ర్యాంకులు తమ విద్యార్థులు పొందారని వెల్లడించారు. ఈసారి ఐఐటిల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం వాటా శ్రీచైతన్యదేనని పేర్కొన్నారు. దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామనడానికి తమ ఫలితాలే నిదర్శనమన్నారు. ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు అభినందించారు.