నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఈనెల 7వ తేదీన అబిడ్స్ లోని ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని టెంపుల్ కన్వీనర్ వరద కృష్ణ దాస్ తెలిపారు. బుధవారం ఇస్కాన్ టెంపుల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 47 ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇస్కాన్ టెంపుల్ కు ఎంత చరిత్ర ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లక్ష మంది వరకు భక్తులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉందని టెంపుల్ వద్దనే స్టాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత సైన్స్ తో పాటు భక్తి భావం కలిగి ఉండాలని సూచించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ జెవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు