న్యూఢిల్లీ: శ్రీలంక ప్రభుత్వం దాదాపు 300 ఉత్పత్తుల దిగుమతులపై ఉన్న నేషేధాన్ని ఎత్తివేసింది. గతేడాది ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంది. విదేశీ మారకం నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. 2022 ఏప్రిల్‌లో విదేశీ చెల్లింపుల్లో విఫలమయ్యింది. దీంతో దిగుమ తులపై ఆంక్షలను విధించింది. తాజాగా 286 ఉత్పత్తులపై దిగుమతి ఆంక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన చేసింది. క్రితం మార్చిలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్‌ను ప్రకటించింది. దీంతో ఆ దేశ పరిస్థితి కొంత మెరుగైంది. మరో 928 ఉత్పత్తులపై దిగుమతి నిషేధం కొనసాగుతుంది. ఇందులో వాహనాలు కూడా ఉన్నాయి.