బంగ్లాదేశ్‌పై శ్రీలంక ‘రికార్డు’ విజయం

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ‘రికార్డు’ విజయం సాధించింది. ఆసియా కప్ సూపర్-4 దశలో కూడా ‘నాగిని వైరంలో శ్రీలంక పైచేయి సాధించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బాగానే కట్టడి చేశారు. అయితే సదిర సమర విక్రమ్(93) అద్భుతంగా పోరాడాడు. అతనితో పాటు కుషాల్ మెండీస్(50), పాతుమ్ నిస్సంక(40) కీలకమైన ఇన్నింగ్స్ లో ఆడారు. ఇలా శ్రీలంక బ్యాటర్లు రాణించడంతో ఆ టీం నిర్నిత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో బంగ్లాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆ టీం ఓపెనర్లు మహమ్మద్ నయీమ్(21), మెహదీ హసన్ మిరాజ్(28) ఎక్కువ స్కోరు చేయకుండానే పెవీలియన్ చేరారు. ఈ క్రమంలో ఆ జట్టు లక్ష్యానికి 21 పరుగుల దూరంలో కుప్ప కూలింది. శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దునిత్ వెల్లలేగే ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక సూపర్-4 దశలో మొదటి విజయం సాధించింది.

Spread the love