– అధ్యక్షుడిగా ఎలుమల స్వామి
నవతెలంగాణ మిరు దొడ్డి: దుబ్బాక నియోజకవర్గం లోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎలుముల స్వామి, ఉపాధ్యక్షుడిగా తోకల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా స్వామి, సహాయ కార్యదర్శిగా తోట వెంకటరెడ్డి, కోశాధికారిగా మహిపాల్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎలుముల స్వామి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న శ్రీ మహంకాళి కమిటీ సభ్యులకు రుణపడి ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రెడ్డి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.