నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా జడ్జి సునీత కుంచాల సంపూర్ణ ఆరోగ్యనికి శ్రీరామ రక్ష మెడిటేషన్,యోగ అని జిల్లా జడ్జి సునీత కుంచల అన్నారు.పని ఒత్తిడిలో అనేక రోగాల బారిన పడకుండా ఎలాంటి సాధనాలు చేయడం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలో జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవ సంస్థ ,హార్టెఫుల్ సంస్థ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది.అంతర్జాతీయ యోగా డే ను నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల ,న్యాయ సేవాసంస్థ కార్యదర్శి పద్మావతి ,డాక్టర్ జలిగం తిరుపతి రావు హాజరైయ్యారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు సంరక్షించుకోవాలి.సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలు మెడిటేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.యోగతో పాటు మెడిటేషన్ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయని చెప్పారు.విదినిర్వహణలో ఎన్నో ఉత్తిడికి లోనవతమని వాటి పరిష్కారానికి ఇదొక చక్కటి అవకాశమని జిల్లా జడ్జి తెలిపారు.కార్యక్రమంలోహార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్ ఏ .నగేష్,సిబ్బంది ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.