నవతెలంగాణ-హైదరాబాద్ : పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశార. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.