కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం: శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 
 సీనియర్ సిటిజన్స్ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నామని, ఫోరంలు  గ్రామ గ్రామాన విస్తరించాలి. అని విశ్రాంత అధ్యక్షులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో బుధవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం . వారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు కోమన్పల్లి, ఇస్సాపల్లి, మామిడిపల్లి గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. సభా కార్యక్రమానికి దోండి  నారాయణ వర్మ సభాధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులు  రామ్మూర్తి,ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి సాయన్న  డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు భూమన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో సీనియర్ సిటిజన్స్ ఫోరములు ఏర్పాటు చేసి, 60 ఏళ్లు పైబడిన వారిని సభ్యులుగా తీసుకొని వారి కష్ట,సుఖాల్లో సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు పాల్పంచుకోవాలని, అప్పుడప్పుడు వారికి ఉపయోగపడే వినోదం, విజ్ఞానం, ప్రస్తుతం మారుతున్నంగా  రాజకీయ పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం,వైద్య శిబిరాలు నిర్వహించడం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో యోగ వ్యాయామము,ధ్యానము లాంటి కార్యక్రమాలపై అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి కుటుంబాలలో కలతలు కన్నీళ్లు లేకుండా పరిష్కార నైపుణ్యాలపై తర్ఫీదునిస్తూ మేధావులతో ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల సాధక బాధకాలను తెలుసుకొని వారికి సేవలు అందించాలని, బీపీ,షుగర్ మోకాళ్ళ నొప్పి వంటి వ్యాధులకు ఉపశమనం కలిగించే చికిత్సలు ఏర్పాటు చేయాలని,అప్పుడప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించాలని, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించాలని,వీలైతే గ్రామాలలో స్థలాన్ని స్వీకరించి ఒక సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనాన్ని కూడా నిర్మించుకోవాలని,ముందు తరాలకు ఉపయోగపడే విధంగా సేవలందిస్తూ సీనియర్ సిటిజన్స్ బాధల్లో ఉన్న వారికి బాసటగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన  అతిథులందరిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతం ఉద్యోగుల సంఘం నుండి  ఆర్మూర్ గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, ఆర్మూర్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి,కోశాధికారి గంగారాం, సీనియర్ సిటిజన్ ఫోరం ఆర్మూర్ డివిజన్ లీగల్ అడ్వైజర్ ఎల్. భూపతిరెడ్డి, చిన్నారెడ్డి,వడ్డెన్న, రాజేశ్వర్ రావు,సుదర్శన్, రాజేశ్వర్, గంగాధర్,జింధం నరహరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love