
గురువారం మధ్యాహ్నం పెద్దపల్లి నుండి మంథనికి వస్తుండగా కమాన్ పూర్ మండలములోని గుండారం గ్రామము వద్ద ప్రమాదవశాత్తు రోడ్డుపై ప్రమాదం జరిగింది. గమనించిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు తన వాహనాన్ని ఆపి, పోలీస్ సిబ్బందిని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొనీ, జిల్లా హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ తన మానవత్వాన్ని చాటుకున్నారు.