నవతెలంగాణ-హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు 4 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.8 అడుగులకు చేరింది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతోంది. ప్రాజెక్టులోకి 2500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో జలాశయంలో నీటిమట్టం 1,403.7 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. నిజాం సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ఇప్పుడు 16 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది