శ్రీరంగ నీతులు..

సుహాస్‌, కార్తిక్‌ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. రాధావి ఎంటర్టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తిచేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అలాగే అతి త్వరలో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారు.విరాజ్‌ అశ్విన్‌, తనికెళ్ల భరణి, గీత భాస్కర్‌, శ్రీనివాస్‌ అవసరాల, దేవీ ప్రసాద్‌, జీవన్‌ రెడ్డి, సంజయ్‌ స్వరూప్‌,సీవిఎల్‌ నరసింహా రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌, సంగీతం: హర్ష వర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అర్సాడ, సినిమాటోగ్రఫి: టిజో టామి.

Spread the love