హైదరాబాద్ : ఐకానిక్ ప్రీమియం మెన్స్ వేర్ బ్రాండ్ అయిన ఆరో తాజాగా తన నూతన కలెక్షన్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. ఈ సమ్మర్ స్ప్రింగ్ కలెక్షన్‌లో అన్ని సందర్భాలకు సరిపోయేలా పురుషుల దుస్తులు ఉంటాయని పేర్కొంది. ఆటోప్రెస్ షర్టులు, ఆటోప్లెక్స్ ప్యాంట్లు, ఐకానిక్ వైట్ షర్టులతో సహా ఫార్మల్ వేర్లు ఈ కొత్త కలెక్షన్‌లో ఉన్నాయని తెలిపింది. ఆరో కొత్త ఎస్‌ఎస్ 23 కలెక్షన్లు లేటెస్ట్ ట్రెండ్లకు అనుగుణంగా ఉంటాయని ఆరో సిఇఒ సుమన్ సాహా పేర్కొన్నారు.