ఎస్‌ఎస్‌సీ జేఈ, స్టెనో పరీక్ష తేదీల ప్రకటన

నవతెలంగాన – ఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసింది. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) పరీక్ష (పేపర్‌-1) అక్టోబర్‌ 9, 10, 11 తేదీల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి అండ్‌ డి పరీక్షను అక్టోబర్‌ 12, 13 తేదీల్లో; జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ అండ్‌ సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పరీక్షను అక్టోబర్‌ 16న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Spread the love