లక్నవరం చెరువు వద్ద మత్తడి స్టార్ట్ అయింది: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి

ssi-srikanth-reddy-started-mattadi-at-lucknavaram-pond– జంపన్న వాగు పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలి  
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని జంపన్న వాగు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ఇంకా రెండు రోజులు కురుస్తాయని ఇప్పటికే లక్నవరం మత్తడి ప్రారంభమైందని జంపన్న వాగు పొంగిపొర్లే అవకాశం ఉందన్నారు. గోనెపెల్లి, వెంగళాపురం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్, మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరదల విషయంలో… ఏ అవసరం ఉన్నా మేము (తాడ్వాయి పోలీస్) సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డయల్ 100 కు కాల్ చేసి పోలీస్ సాయం పొందాలని కోరారు.
Spread the love