పది ఫలితాల్లో సెయింట్‌ ఆంథోనీ విద్యాసంస్థల ప్రభంజనం

నవతెలంగాణ-దుండిగల్‌
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కొంపల్లి, సుచిత్రలోనీ సెయింట్‌ ఆంథోనీ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో 9 మంది విద్యార్థులు జీపీఏ 10/10 సాధించగా, 9.0 పై జీపీఏలు 50 మంది విద్యార్థులు సాధించగా, 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌ నరిశెట్టి సుందర రాజు పుష్పగుచ్చం అందించి అభినందించారు. అధ్యాపకుల కషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సరితా , విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love