డెంగ్యూతో స్టాఫ్‌ నర్స్‌ మృతి

 Staff nurse died of dengueనవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ములుగు జిల్లా ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో ఎంసీహెచ్‌ స్టాఫ్‌ నర్సు సాధనపెల్లి రజని డెంగ్యూ జ్వరంతో బాధ పడుతూ సోమవారం మృతి చెందారు. వాజేడు మండలానికి చెందిన రజిని ఏటూర్‌నాగారం సామా జిక ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూడు రోజులుగా డెంగ్యూ పాజిటివ్‌తో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రజని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలిస్తుండగా..తాడ్వాయి-ములుగు మార్గమధ్యలో ఆమె మృతి చెందారు. రజిని వాజేడులోని కొప్సూరులో భర్త, పిల్లతో కలిసి ఉంటూ సామాజిక ఆస్పత్రికి విధులపై వస్తుంటుంది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స అందించే క్రమంలో మృతిచెందిందని భర్త తాజ్‌ తెలిపారు.

Spread the love