వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది

– 48 గంటల నిరసన వంట వార్పు
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ- కంటేశ్వర్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది 48 గంటల నిరసన వంటవార్పు సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రోజు ధర్నా చౌక్ వద్ద వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయాలని మరియు నోటిఫికేషన్ రద్దు చేయాలని అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ సమస్యల మీద 48 గంటల నిరసన వంట వార్పు సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లొయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం అనగా 8/8/2023 మరియు 9/8/2023 రెండు రోజుల 48 గంటలు కలెక్టరు కార్యాలయంవద్ద వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎం పి హెచ్ ఎ (ఎఫ్) భర్తీ కోసం నోటిఫికేషన్ 2/2023 జరీ చేసింది. 1520 పోస్టులు భర్తీ చేయబోతుంది, ఈ రెక్రూట్ మెంట్ కోసం పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ చేయబోతుంది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పరీక్ష వ్రాసి సెలెక్ట్ అయే పరిస్తితి ఉంది. సర్వీస్ కు 20 మార్కుల వెయిటేజీ ఇచ్చిన ప్రయోజనం ఉండదు. గత 20 సంవత్సరాల గా వీరు పని చేస్తున్నారు. గతంలో వీరంతా డీఎస్సీ ద్వార రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ( rule of reservation) మెరిట్  రొస్టర్ ప్రకారం ఎంపిక చేయబడి పని చేస్తున్నారు. మళ్లి పరీక్ష వ్రాయడం న్యాయం కాదు.ఇప్పటికే చాలా మంది కి వయసు దాటి పోతుంది, వీరిని ఖాళీలు ఉన్న పోస్టులో రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్య క్రమం ప్రతీ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది.ఈ డిమాండునీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు అయితే 15/8/2023 నుండి కాంట్రాక్,ఔట్ సోర్సింగ్ ఎం పి హెచ్ ఎ (ఎఫ్) అందరూ సమ్మే లోకి వెళ్తారని హెచ్చరిస్తున్నాము. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ఈ కార్యక్రమం టి యు ఎం హెచ్ ఈ యు (TUMHEU) జిల్లా అధ్యక్షుడు సంజూ జార్జ్, వర్కింగ్ ప్రసిడెంట్  ప్రవీణ్ రెడ్డి, సలహా దారు  వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి పుష్ప మరియు షాదుల్లా,గంగజమున,వీణ,సరోజ,ప్రమీల , జిల్లా లో ఉన్న 32 పీహెచ్సీ లలొ ఉన్న కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ ఎంపీ హెచ్ఏ ఎఫ్ ) లు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Spread the love