నవతెలంగాణ-పెంచికల్‌పేట్
మండలంలోని పోతపెల్లి గ్రామ పంచాయతీలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంట్లపేట గ్రామంలోని కొత్తవాడలో వరద నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షానికి నీరు నిలువడంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటికి ఉపయోగించే బోరు సైతం నీటిలో ఉండడంతో నీటికి ఇబ్బంది అవుతుందని స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీరు వెళ్లేల చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.