తెలంగాణతో కలిసి పని చేస్తాం: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటన

Working with Telangana: Stanford University announcement నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని ఈ బృందం సందర్శించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ సీనియర్ ప్రతినిధులతో చర్చించారు. హెల్త్ కేర్, కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, స్కిల్ యూనివర్సిటీలకు మద్దతు ఇచ్చేందుకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ ముందుకు వచ్చింది. తెలంగాణలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ అధికారులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. స్టాన్‌ఫోర్డ్ గ్లోబల్ లీడర్ల భాగస్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును కూడా పరిశీలించాలని కోరారు.

Spread the love