నూతన సీసీ రోడ్లు ప్రారంభం

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
సుభాష్‌ నగర్‌ 130 డివిజన్‌ పరిధిలో సీసీ రోడ్లను మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ లలో గల బస్తీలు, కాలనీలలో బీటీ, సీసీ, వీడిసీసీ కొత్త రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మంచినీరు, డ్రయినేజీలను ఆధునీకరణ కూడా చేపట్టినట్టు వెల్లడించారు. ఫుట్‌ పాత్‌ల అభివృద్ధి, పార్కుల సుందరీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, ప్రధానంగా కలుషిత మంచినీటి సమస్య పరిష్కరిం చడానికి కషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటానని, ప్రభుత్వ విప్‌, మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకరాలతో డివిజన్‌ను ఆదర్శవం తంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యంగా పేర్కొన్నారు.

Spread the love