మండలంలోని రామచంద్రు తండాలోని నీటి పారుదల కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత, చెట్ల తొలగింపు పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి సహకారంతో మండలం అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు జాటోత్ వెంకన్న, పార్టీ నాయకులు పాల్గొన్నారు.