ఉపాధిహామీ చట్టం రక్షణ కోసం 25న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు

– టీవ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
ఎన్నో పోరాటాల ఫలితంగా, త్యాగాల ఫలితంగా గ్రామీణ పేదలకు, వ్యవసాయ కూలీలకు పని గ్యారంటీ కోసం, వలసల నివారణ కోసం వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీచట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని కుట్రలను తిప్పికొడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణకై ఈనెల 25 న హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చినారు.ఆదివారం భువనగిరి మండలపరిధిలోని హన్మాపురం గ్రామంలో ఉపాధిహామీ కార్మికులతో కలిసి సదస్సు జయప్రదం కోసం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.భారత రాజ్యాంగం ద్వారా 2005లో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పని కోరిన వారికి ఆ గ్రామ పరిధిలో వందరోజుల పని దినములు పిలిపించి కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడిందని కానీ బిజెపి ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన నుండి 2019లో పార్లమెంటులో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఉపాధి హామీ స్వాసిత కొనసాగింపు ఉండనుందన్నారు.ఈ చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని స్పష్టంగా ప్రకటించాడని తప్పుపడుతూ ఈ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేసిన ఫలితంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్దిగా వెనుకకు తగ్గిందన్నారు.కానీ ప్రతి బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ కూలీల సంఖ్య అనుగుణంగా పనులు కల్పించకుండా కొత్త కొత్త జీవోలు తెస్తూ చట్టంలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, 15 రోజులకు ఒక్కసారి చేసిన పనికి కూలీలకు డబ్బులు చెల్లించకపోవడం, రెండుసార్ల ఫొటో విధానం, కూలీల ఆధార్‌ కార్డు బ్యాంకు లింకు పెట్టడం, వేసవిలో చేసిన పనికి అదనమైన డబ్బులు ఇవ్వడం లాంటివి అన్నింటిని తగ్గిస్తూ చట్టాన్ని తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఉన్నదన్నారు.ఈ చట్టం వచ్చిన తర్వాత కరోనా పరిస్థితులలో గ్రామీణ ప్రజలకు, నిరుద్యోగులకు ఎంతోగాను ఉపయోగపడిందన్నారు. గ్రామీణ ఆర్థిక పరిస్థితులలో కూడా అనేక మార్పులు వచ్చాయని, ఇలాంటి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నుండి వ్యవసాయ కూలీలు, ఉపాధి కార్మికులు, ప్రజలు కాపాడుకోవాల్సిన కర్తవ్యం మన ముందు ఉందన్నారు.చట్టం రక్షణ కోసం ఈనెల 25న హైదరాబాదులో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు రాజ్యసభ సభ్యులు శివదాసన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు టి.వెంకట్‌రాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.గోపాల్‌, ఆకునూరి మురళి, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్రాములు, ఎన్‌ బాల మల్లేష్‌, ఎన్‌.పాల్‌ దివాకర్‌, పి.శంకర్‌ లాంటి అనేకమంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మేధావులు పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు మోటఎల్లయ్య, ఉపాధికూలీలు గోమారి పద్మ, తుమ్మేటి ఎల్లమ్మ, సోమ అందాలు, జడల మమత, జడల అనసూర్య, బుచ్చాల అండాలు, బుచ్చాల హేమలత, మూడుగుల వరమ్మ, మూడుగుల సుజాత, బండారి ఇందిరా, బండారి గీత పాల్గొన్నారు.

Spread the love