నవతెలంగాణ-కంటేశ్వర్ : రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్రం నూతన రాష్ట్ర కార్యవర్గం రాఘవ రత్న టవర్స్ ఆబిడ్స్ హైదరాబాద్ ఆల్ ఇండియా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షులు మాయ వార్ రాజేశ్వర్-డిసిఐసి-నిజామాబాద్ జిల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ రతన్ సింగ్-డిసిఐసి-హనుమకొండ జిల్లా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ డి సి ఐ సి మెహబూబాబాద్ జిల్లా,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బాల లింగయ్య, డి సి ఐ సి మహబూబ్ నగర్ జిల్లా, రాష్ట్ర సహాయక కార్యదర్శి: పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, డిసిఐసి సూర్యాపేట జిల్లా,రాష్ట్ర కోశాధికారి: చింతమళ్ళ గురువయ్య డిసిఐసి నల్గొండ జిల్లా, రాష్ట్ర రీజినల్ సెక్రెటరీ గిరగాని సుదర్శన్ గౌడ్ డి సి ఐ సి- వరంగల్ జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్ మెదక్ జిల్లా, దీక్షితులు రంగారెడ్డి జిల్లా చిక్కిల్లి మధు బాబు మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి), బి సువర్ణ కామారెడ్డి జిల్లా, తిరుపతయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామకృష్ణ ఖమ్మం జిల్లా వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులకు, సభ్యులకు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.