– కాంట్రాక్టు ఉద్యోగం నుండి రెగ్యులర్ ఉద్యోగం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్టు లెక్చరర్లు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్స్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహించే ఉపాధ్యాయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టు లెక్చరర్ లను రెగ్యులర్ లెక్చరర్లుగా చేయడం 18 సంవత్సరాల కాలంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసిన తమకు రెగ్యులరైజేషన్ చేయడం ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు అంటూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఆవిర్భావ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు రెగ్యులర్ అయిన కాంట్రాక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.