మెడికల్‌ కాలేజీలో కనిపించని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు…?

–  వార్షికోత్సవ వేళ కాలేజ్‌లో హోమం…!
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్‌ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించిన దాఖలాలు ఏమాత్రం కనిపించలేదు. కాగ జూన్‌4న మెడికల్‌ కాలేజ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాలేజ్‌లో పెద్దఎత్తున హౌమం నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ, దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎలాంటి సంబురాలు లేవు. కాలేజి ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా అధికారులు హౌమం చేసిన తీరు పట్ల పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. మెడికల్‌ కాలేజ్‌ అంటెనే సైన్‌ సంబంధిత బోధన ఉంటుంది. ఇలాంటి కాలేజిలో హౌమాలు నిర్వహించడం, అందులో మెడికోస్‌ను పాల్గొనేలా ఆచేయడం ఏమిటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తిచేసుకుని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో కాలేజిలో ఎలాంటి సంబురాలు లేక పోవడం, మెడికల్‌ కాలేజ్‌ ప్రధమ వార్షికోత్సవ వేళ హౌమం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా చిన్న పంచాయతీ కార్యాలయం నుండి కలెక్టరేట్‌ కార్యాలయాల వరకు రంగు రంగుల విద్యుత్‌ దీప కాంతులు, మామిడి తోరణాలు, రంగురంగు తోరణాలతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి త్వరణంలో కొత్తగూడెం మెడికల్‌లో సంబురాల దాఖలాలు లేక పోగా, కాలేజీ హౌమం నిర్వహించడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.

Spread the love