రాజ్యాధికారమే ఏజెండగా పోరాటం..

– నెమలి నరసయ్య మాదిగ ఉద్యోగ ఫెడరేషన్ కోఆర్డినేటర్..
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ వేడుక మహాజన సోషలిస్టు రాజ్యాధికారమే ఎజెండాగా పోరాటం సాగుతోందని మాదిగ ఉద్యోగ ఫెడరేషన్ కోఆర్డినేటర్ నెమలి నరసయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు జంగిడి ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెమలి నరసయ్య ఎం ఎస్పీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు కల్లేపల్లి రమేష్ లు హాజరై మాట్లాడారు. సంచార జాతులు,పీడిత వర్గాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అగ్రవర్ణ పేదలతో మహాజన సోషలిస్ట్ రాజ్యాధికారం సొంతం చేసుకుంటాం అన్నారు.  మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్తిత్వం, సామాజిక స్పృహ,రాజ్యాధికారం ఆలోచన సామాజిక న్యాయమే ధ్యేయంగా ఈ దేశం మొత్తంలో 29 సంవత్సరాలుగా పోరాటం చేసిన  చేస్తున్నా మంద కృష్ణమాదిగ  తోనే సాధ్యమైందని. పోరాటంలో  వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు ఉద్యమం, ఆరోగ్యశ్రీ, కార్డు ఆకలికేకల పోరాటం ఎస్సీ ఎస్టీ చట్టం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ ఐదు సంవత్సరాల పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు మాల మాదిగల ఆదివాసి లంబాడీలపై హత్యలు హత్యాచారలపై మాట్లాడు మాట్లాడే ఈ రాజ్యంపై యుద్ధం చేసే సామాజిక ఏకైక సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగ* ఉద్యమమే నని గుర్తు చేశారు ఈ దేశానికి ముఖ్యంగా ఈ తెలంగాణ దోరల రాజ్యాన్ని కూలగొట్టడానికి మహాజన సోషలిస్టు రాజ్యాధికారమే ధ్యేయంగా అణగారిన వర్గాల ప్రజలు, పీడిత వర్గాల ప్రజలు, సంచార జాతులు,ఆదివాసి, మహాజన ప్రజలందరూ మహాజన సోషలిస్ట్  రాజ్యాధికారమే ధ్యేయంగా బూతు కమిటీ నుండి పార్లమెంట్ కమిటీ  వరకు కమిటీల నిర్మాణంతో పాటు ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జన్ను సుధాకర్ మాదిగ కోకిల సాంబయ్య బొచ్చు రవిమాదిగ, స్థానిక ఎంపీటీసీ గోపి దాసు ఏడుకొండలు, మడికొండ అమర్నాథ్, నద్దునూరి మహేష్, గాజుల చంద్రయ్య, పాల్వాయి పరశురాం మాదిగ, ఇంద్రగంటి సతీష్ మాదిగ కోకిల నరసక్క మాదిగ, పడిదల సమ్మక్క జన్ను మరియా జిల్లా మొదటి తరం ఎమ్మార్పీఎస్ నాయకులు వంగూరి నాని మాదిగ జన్ను సుధాకర్ తదితరులు పాల్గొనినారు.
Spread the love