ఎన్జీవోఎస్ కేంద్ర రాష్ట్ర సంఘ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవం

– ఏకగ్రీవమై బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా కార్యవర్గాన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ ఎన్జీవోస్ జిల్లా నాయకులు
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ ని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ని, కేంద్ర సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ని,కోశాధికారి రామినేని శ్రీనివాస్ రావు ని కేంద్ర సంఘంలో జిల్లా పక్షాన మొదటిసారి కేంద్ర సంఘ కార్యదర్శిగా, పోల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా సతీష్ కుమార్ లను నాంపల్లి హైదరాబాద్ లో గల టిఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయంలో, టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన గజమాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించగా, సానుకూలంగా స్పందించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపిన టీఎన్జీవో జిల్లా అధ్యక్ష బృందం. ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , టిఎన్జీవో మాజీ జిల్లా కార్యదర్శి, ఆడిట్ ఆఫీసర్ సంఘం అమృత్ కుమార్, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, సతీష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, గుడికందుల సంజీవయ్య, జనార్ధన్, సతీష్ కుమార్, దినేష్ బాబు, షికారి రాజు, మహేందర్, జాకీర్ హుస్సేన్, ఉమా కిరణ్ , టీఎన్జీవో సలహాదారులు ఆకుల ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Spread the love