22న రాష్ట్ర బంద్‌

నవతెలంగాణ – కర్ణాటక
విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల మండలి హుబ్బళ్లి శాఖ ఈనెల 22న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చింది. గురువారం నాడు నిర్వహించే కర్ణాటక బంద్‌ను విజయవంతం చేయాలని బళ్లారి జిల్లా వాణిజ్య పరిశ్రమల సంఘం కోరింది. సంస్థ చైర్మన్‌ శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి యశ్వంత్‌ రాజ్‌ నాగిరెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ బళ్లారి జిల్లా రైస్‌ మిల్‌ అసోషియేషన్‌, కాటన్‌ అసోషియేషన్‌ , ఇండస్ట్రీయల్‌ అసోషియేషన్‌ ,స్పాంజ్‌ ఐరన్‌ అసోషియేషన్‌ , గార్మెంటీస్‌ అసోషియేషన్‌. కోల్డ్‌ స్టోరేజ్‌ అసోషియేషన్‌ ఏపీఎంసీ మర్చంట్స్‌ అసోషియేషన్‌ పదాధికారులతో సంస్థ హాలులో సోమవారం ప్రాథమిక సన్నాహక సమావేశం నిర్వహించాం. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కర్ణాటక బంద్‌ ప్రశాంతంగా నిర్వహిస్తామని, వర్తక, వాణిజ్య,పరిశ్రమలు మాత్రమే బంద్‌ చేస్తామన్నారు. ఇతర ప్రాంతాలలో, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా రవాణా, ఆరోగ్యంతో సహాపౌరుల జీవన చర్యలు సాధారణంగా ఉంటుందన్నారు. మున్పిపల్‌ కాలేజీ మైదానంలో తరలివచ్చే నిరసనకారులు బెంగళూరు రోడ్డు,హెచ్‌ఆర్‌జీ సర్కిల్‌ మీదుగా తేరువీది మీదుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికార యంత్రాంగానికి నిరసన లేఖ అందజేస్తామన్నారు. బళ్లారి వాణిజ్య, పరిశ్రమల కార్పోరేషన్‌ రిజిస్టర్‌ అయిన సంస్ధలతో పాటు పౌర సమాజ సంస్థలు బంద్‌లో పాల్గొంటామన్నారు. చార్జీల పెంపుతో నష్టపోయిన వారు ముందుకు రావాలన్నారు.

Spread the love