28 నుండి మధ్యాహ్నం భోజన కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె

– డీఈఓ సూపర్డెంట్‌ సమ్మె నోటీస్‌ అందజేత
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్‌ సీఐటీయూ అనుబంధం సంఘం మధ్యాహ్నం భోజన కార్మికులకు పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్‌ ఇవ్వాలని, కొత్త మెనుకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 28 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తున్నామని డీఈఓ సూపర్డెంట్‌కు మంగళవారం సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.పద్మ, ఎస్‌డీ సుల్తానా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు 2022 ఫిబ్రవరి 22న వేతనాలు పెంచుతామని ప్రకటించి జీవో కాఫీ ఇచ్చి నేటికీ 18 నెలలు కావస్తున్నా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం అని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు అనేక కష్టాలకోర్చి మధ్యాహ్న భోజన నిర్వహణ చూస్తున్నారని ప్రభుత్వం నెలనెలా బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కొత్త మెయిన్‌ సవరించాలని, పిల్లలకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని లేదా ప్రభుత్వమే అంగన్వాడీ కేంద్రాలకు వేసినట్టు సరఫరా చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, తదితర సమస్యలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్‌, మధ్యాహ్న భోజన కార్మికులు రామలక్ష్మి, వెంకట్‌ నర్సమ్మ, అరుణ, క్రాంతి, రాణి, పద్మ, మణమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love