నిలిచిన పాడి ప్రోత్సాహకం

– ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలి
– పాడి రైతులకు రూ.12 కోట్ల బకాయిలు
ప్రభుత్వ విజయ డెయిరీకి పాలు పోస్తున్న. లీటరు పాల ధరపై అదనంగా నాలుగు రూపాయలు ప్రోత్సహకం కింద ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ డబ్బులు ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేయాలి.
– రైతు సాయిబాబు, రాయిచేడి గ్రామం
రూ.12 కోట్ల బకాయిలు ఉన్నాయి
విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు లీటర్‌ ధరపై అదనంగా ప్రోత్సాహం కింద 4 రూపాయలు కలిపి చెల్లిస్తున్నాం. అయితే, మూడేండ్లుగా ప్రోత్సాహక నిధులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 7200 మంది రైతులకు సంబంధించి రూ.12 కోట్లు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే రైతుల ఖాతాలో జమ చేస్తాం. సత్యనారాయణ, విజయ డెయిరీ జిల్లా అధికారి
– నిధులు రాగానే ఖాతాల్లో జమ చేస్తాం: జిల్లా అధికారి
నవ తెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ విజయ డెయిరీ పాల రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఆగిపోయింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 2020 మే నుంచి 4 రూపాయల ప్రోత్సాహం నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు లీటర్‌ ధరపై అదనంగా ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయ డెయిరీలోనే పాలు అమ్ముకునేలా ప్రోత్సాహకం అమలు చేసింది. కానీ ఆ నిధులు ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతుల సంఖ్య పెరిగింది. పాల సేకరణ కూడా పెరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా పాడి రైతులకు 12 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. ఆవు పాలు లీటరు ధర 42 నుంచి 49 రూపాయలు చెల్లిస్తున్నారు. గేదె పాలు లీటరుకు 40 రూపాయల నుంచి 80 రూపాయల వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పాలలో ఉన్న ఫ్యాట్‌ ప్రకారంగా ధర ఖరారు చేస్తారు. అచ్చంపేట నాగర్‌ కర్నూల్‌, వెల్దండ, కుప్పగండ్ల, మాదారం, ఊరకొండ, గూడూరు, కల్వకుర్తిల్లో పాలశీతలీకరణ కేంద్రాలు రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. రోజుకు 62 వేల లీటర్లు పాల సేకరణ జరుగుతున్నది. మొత్తం 7200 మంది రైతులు ప్రభుత్వ విజయ డెయిరీకి పాలు పోస్తున్నారు. విజయ డెయిరీకి పాలు పోయాలని రైతులను ప్రోత్స హించడానికి ప్రభుత్వం లీటర్‌ ధరపై అదనంగా నాలుగు రూపాయల ప్రోత్సా హం చెల్లిస్తూ వస్తోంది. కానీ మూడేండ్ల నుంచి ప్రోత్సాహక నిధులు నిలిచిపో వడంతో రైతులు నిరుత్సాహంతో ఉన్నారు. మరోపక్క ప్రయివేటు డెయిరీ నిర్వాహకులు పాడి రైతులకు ముందుగానే అడ్వాన్స్‌ రూపంలో నగదు చెల్లించి పాలు పోయించు కుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాల ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

Spread the love