లాభాల్లో స్టాక్‌ మార్కెట్

నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 67,295 సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద ప్రారంభమైంది.

Spread the love