భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..

stock marketనవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరికి సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 76,348 వద్ద ముగియగా…. నిఫ్టీ 283 పాయింట్ల లాభంతో 23.190 వద్ద స్థిరపడింది.
ఇవాళ 2,296 షేర్లు లాభాలతో కళకళలాడగా… 1,554 షేర్లు నష్టపోయాయి. 124 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేదు. అన్ని ప్రధాన రంగాలకు చెందిన షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, టెలికాం షేర్లలో 1 శాతం పెరుగుదల నమోదైంది.

Spread the love