Stock Market : నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets-closed-in-lossesనవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ మార్కెట్లు కోలుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్లు నష్టపోయి 65,512కి దిగజారింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 19,528 వద్ద స్థిరపడింది.

Spread the love