నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock-Marketనవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు… ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. చివరకు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు కోల్పోయి 81,820కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 25,057కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐసీఐసీఐ బ్యాంక్ (1.90%), భారతి ఎయిర్ టెల్ (1.26%), ఏషియన్ పెయింట్స్ (1.01%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.83%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.76%).
టాప్ లూజర్స్: బజాజ్ ఫైనాన్స్ (-2.73%), రిలయన్స్ (-2.09%), టాటా స్టీల్ (-1.67%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.19%), టాటా మోటార్స్ (-1.14%).

Spread the love