భారీ ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ -ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు వెల్లువెత్తుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వంటివి మార్కెట్లలో జోష్ ను నింపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 65,479కి చేరుకుంది. నిఫ్టీ 66 పాయింట్లు పుంజుకుని 19,389కి ఎగబాకింది. ఐటీ, టెక్, బ్యాంక్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి.

Spread the love