లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex-is-at-67-thousand

నవతెలంగాణ -ముంబాయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో మొదలై.. లాభాలతోనే ముగిసాయి. సెన్సెక్స్‌ 232.23 పాయింట్ల లాభంతో 65953.48 వద్ద.. నిఫ్టీ 80.30 పాటింట్ల లాభంతో 19597.30 వద్ద ముగిసాయి. నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ & నిఫ్టీ రెండూ లాభాలను పొందగలిగాయి. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో టాప్ గెయిన్స్ కంపెనీల జాబితాలో దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సన్ ఫార్మా సంస్థలు నిలిచాయి. కాగా బ్రిటానియా, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి. ఈ రోజు ఆటో మొబైల్ మార్కెట్లు కొంత నష్టాలను పొందినట్లు స్పష్టమవుతోంది.

Spread the love