లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లో కూడా లాభాలను మూటకట్టుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లపై రేపు ప్రకటన చేయనుంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్న తరుణంలో రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 63,143కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 18,726కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: నెస్లే ఇండియా (2.97%), టాటా స్టీల్ (2.29%), టాటా మోటార్స్ (2.21%), భారతి ఎయిర్ టెల్ (1.70%), ఎల్ అండ్ టీ (1.66%).
టాప్ లూజర్స్: కొటక్ బ్యాంక్ (-1.15%), బజాజ్ ఫైనాన్స్ (-0.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.24%), మారుతి (-0.21%).

Spread the love