లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 22,198 వద్ద స్థిరపడింది.

Spread the love