నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలబాట పట్టాయి. ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు నష్టపోయి 73,677కి పడిపోయింది. నిఫ్టీ 49 పాయింట్లు కోల్పోయి 22,356 వద్ద స్థిరపడింది.

Spread the love