భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కేసేపటికే నష్టాల్లోకి జరుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,304కి పడిపోయింది. నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

Spread the love