భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం మన మార్కెట్లపై పడలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 66,902కి ఎగబాకింది. నిఫ్టీ 207 పాయింట్లు పుంజుకుని 20,097కి పెరిగింది.

Spread the love