నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా 8 సెషన్లుగా నష్టాలు చవిచూసిన సూచీలు.. ఎట్టకేలకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయమంతా నష్టాల్లో చలించిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. ముఖ్యంగా బ్లూచిప్ స్టాక్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. సెన్సెక్స్ ఉదయం 75,641.41 (క్రితం ముగింపు 75,939.21) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,294.76 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో పుంజుకుని 57 పాయింట్ల లాభంతో 75,996.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.25 పాయింట్ల లాభంతో 22,959.50 వద్ద ముగిసింది.