భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నవతెలంగాణ- ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 65,280కి పడిపోయింది. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 19,331కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: టాటా మోటార్స్ (2.94%), టైటాన్ (1.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.24%), టీసీఎస్ (0.09%).
టాప్ లూజర్స్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.23%), ఎన్టీపీసీ (-2.04%), బజాజ్ ఫైనాన్స్ (-1.93%).

Spread the love