నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు భారీ నష్టాల్లో ముగిసింది. సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా మిగతా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద ముగియగా… నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24,199 వద్ద స్థిరపడింది.