భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock-Marketనవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత బలంగా పుంజుకొన్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ దాదాపు 1100 పాయింట్ల మేర రాణించగా.. నిఫ్టీ 24,200 ఎగువన ముగిసింది. మెటల్‌, ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో నిన్నటి భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి.

Spread the love