నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 450 పాయింట్ల గ్యాప్ అప్‌తో ట్రేడింగ్‌ని ప్రారంభించాయి. సెన్సెక్స్ సోమవారం 2,223 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ఎఫ్ఐఐలు ఒక్క రోజులోనే రూ.10 వేల కోట్ల షేర్లు అమ్మగా, డీఐఐలు రూ. 9 వేల కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.